ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలను ప్రారంభించారు. రైతుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఇలా  ఎన్నో పథకాలను ప్రారంభించారు. పథకాలను ప్రారంభించి వాటి అమలులోకి కూడా తీసుకొని వచ్చారు. చిన్న పిల్లలకు స్కూల్ యూనిఫామ్, షూస్, నోట్ బుక్స్, ఇలా కావాల్సినవన్నీ ఉచితంగా సరఫరా చేశారు. మహిళలకు కూడా ఎంతో మందికి చేయూత  గా నిలిచారు. వైఎస్ఆర్ అందజేసిన లబ్ధిని ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.                                           


 ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది.  ప్రణాళిక శాఖ పై సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులకు ఈ మేరకు సూచనలు చేశారు.  పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఖచ్చితంగా లెక్కించడం స్పష్టం చేశారు.


 అలాగే ఈ క్రాప్ వ్యవస్థ పై అధ్యయనం చేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో చేస్తున్న ఈ క్రాపింగ్ పరిగణలోకి  తీసుకోవాలని దీనివల్ల ఈ క్రాపింగ్ జరుగుతుందా లేదా అని తెలుస్తుంది అన్నారు. ఇక గ్రామ మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందజేస్తున్న  గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను,వలంటీర్లను సత్కరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.


 వచ్చే ఉగాది రోజున వాలంటీర్లు, సచివాలయ  ఉద్యోగులను సేవా రత్న సేవా మిత్ర సేవా వజ్ర, ఇలాంటి బిరుదులతో ఉగాది రోజున సత్కరించాలని సీఎం ఆదేశించారు. వారికి తగిన నగదు బహుమతి కూడా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే సుస్థిర  సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: