ఎంఐఎం పార్టీ ముమ్మాటికీ రజాకార్ల వారసులే ఇందులో ఎవరికీ అనుమానం లేదు. అయితే గత 75 ఏళ్ళ కాలంలో ప్రజాస్వామ్య సిద్ధాంతాల మార్గంలో నడవక పోగా, రౌడీ ఇజమ్, గుండా ఇజమ్ లో రాటుదేలి ఎడమచేత్తో పాతనగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని నయాన్నో భయాన్నో ప్రజాస్వామ్య వెలుగులు ప్రసరించకుండా అడ్డుకుంటుంది. ఇంతవరకు విద్య, వైద్యం, అభివృద్ధి లాంటి వాటికి సుదూరంలో ఉంది ఇప్పటికి పాతనగరం. దీనికంతటికీ కారణం ఓవైసీ ఓట్ల రాజకీయమే అంటారు. ముఖ్యమంత్రులను అధికార పార్టీని గుప్పిట్లో ఇరికించుకుని చేసే దుందుడుకు రాజకీయాలకు తెరపడితే తప్ప పాతనగరంలో ప్రజాస్వామ్య వెలుగులు ప్రసరించవు. తొలినుంచి కాంగ్రెస్ తో దాని స్నేహం పాతనగరాన్ని అంధకారంలో మగ్గేలా చేసింది. ఇప్పుడు నిజాం దొరల వారసత్వాన్ని నూరుపాళ్లు పుణికి పుచ్చుకున్న కేసీఆర్ నాయకత్వంలోని టిఆరెస్తో దాని బంధం మరింత పఠిష్టమై మహానగరం ప్రక్కన స్వయంపాలిత లంకలా మారిపోయింది
 


పాతనగరంలో రాజకీయంగా తిరుగు లేని అధికార పక్షంగా మజ్లిస్ నిలుస్తుంది. హైదరాబాద్ లోక్ సభ పరిధి లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారిదే అధిక్యత. అన్నింటికి మించిన హైదరాబాద్ పాతనగరంతో పాటు, మైనార్టీలు అధికంగా ఉంటే చోట్ల, ఓవైసీ బ్రదర్స్ కు ధీటుగా నిలిచే నేతలు లేరనే చెప్పాలి. అయితే, ఇందుకు మినహాయింపుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ ను గురించి తెలుసుకోవాలి.


నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పట్టువదలని విక్రమార్కుడిగా పోటీ చేస్తున్న ఆయన, ఇప్పటికి కాకున్నా ఎప్పటికైనా మజ్లిస్ ను ఓడించటమే తన లక్ష్యంగా చెబుతారు.


విశాలభావాలున్న యువకుడు, విద్యావంతుడు, మంచి మాటకారి, మత ఛాందస వాదం ఒంటబట్టని చతురుడు. అంతకు మించిన ధనబలం, కండబలంతో ఓవైసీ బ్రదర్స్ కు ఎప్పుడు ఒక ఛాలంజ్ గా మిగిలాడు. అలా అని, ఓవైసీ బ్రదర్స్ కు మించి అని చెప్పలేం కానీ, వారికి ఇతని ప్రెసెన్సే ఒక హెడ్డేక్ శిరోవేదనే. వాళ్ళని వదలకుండా వేదించగల, ప్రజల మధ్యలో నిగ్గదీయగల నిజాయతి పరుడు. ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు వ్యూహాత్మక సామర్ధ్యం ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఫిరోజ్ ఖాన్ ఒకరు. అలాంటి ఆయన్ను బీజేపీ లోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నిఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.


ప్రజా రాజ్యం పార్టీ నుంచి తొలుత బరి లోకి దిగిన ఆయన తర్వాత కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. మజ్లిస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న ఫిరోజ్ ఖాన్ కు సరైన రాజకీయ దన్ను లభించాలే కానీ ఓవైసీ బ్రదర్స్ కు చుక్కలు చూపించే సత్తా ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. నిజాయతి ఆత్మ విశ్వసం నిండుగా మెండుగా ఉన్న ఈ ‘ఫైర్ బ్రాండ్’ ను బీజేపీలోకి తీసుకొస్తే, విచిత్రమైన సమీకరణాలు చోటు చేసుకోవటం ఖాయం.

మన అవగాహన కోసం ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఎటాచ్ చేశాను వినండి

ఎంతైనా, బీజేపీ అంటే మైనార్టీలు అంతగా నమ్మే పరిస్థితి ఉండదు. అలాంటిది ప్రజల్లో నిత్యం మమేకం కావటంతో పాటు, మంచి మాటకారి అయిన ఫిరోజ్ ఖాన్ లాంటి నేతను తమ పార్టీలోకి తీసుకొస్తే, తమకు మేలు జరుగుతుందని భావించే బీజేపీ నేతల్లో రాజాసింగ్ ఒకరు. ఇప్పటికే లోగుట్టుగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.
 


పార్టీ మారేందుకు ఫిరోజ్ ఖాన్ కూడా మానసికంగా సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో రెండు సార్లు భేటీ అయ్యారని, త్వరలోనే పార్టీ కండువా కప్పు కోవటం ఖాయమంటున్నారు. అదే జరిగితే, ఓవైసీ బ్రదర్స్ కు కొత్త చిక్కులు ప్రారంభం అయినట్లే నని చెప్పక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: