పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ అన్నా, సీఎం జ‌గ‌న్ అన్నా ఇష్ట‌మొచ్చిన‌ట్టు రెచ్చిపోయే మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావును వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో దేవినేని ఉమా త‌న చిరకాల రాజ‌కీయ శ‌త్రువు వ‌సంత ఫ్యామిలీ వార‌సుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత కూడా ఉమాకు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కేపీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు.

మైల‌వ‌రం మండ‌లంలో 13 పంచాయ‌తీల‌కు 13 వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. జి. కొండూరు మండంలో అయితే 25 పంచాయ‌తీల‌కు 22 వైసీపీ ఖాతాలో ప‌డ‌గా.. టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్ర‌మే గెలిచింది. అయితే పంచాయ‌తీ పోరులో ఘోర ప‌రాభ‌వంతో త‌లెత్తు కోలేక‌పోతోన్న ఉమాకు ఇప్పుడు మ‌రోసారి అవ‌మానం ఎదురు కానుందా ? ఈ సారి ఆయ‌న కంచుకోట‌లోనే ఆయ‌న‌కు దెబ్బ ప‌డిపోనుందా ? అంటే అవున‌నే అంటున్నారు. ఆయ‌న కంచుకోట అయిన సొంత నియోజ‌క‌వ‌ర్గం నందిగామ న‌గ‌ర పాల‌క సంస్థ‌కు వ‌చ్చే నెల 10న ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

నందిగామ కంచుకోట ద‌శాబ్దాల త‌ర్వాత గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనే బ‌ద్ద‌లు అయ్యింది. ప్ర‌స్తుతం ఇక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న్ రావు ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ఉమా సామాజిక వ‌ర్గంలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న నేత‌లే ఈ సారి నందిగామ‌లో కూడా టీడీపీని చిత్తుగా ఓడించి ప‌ట్టు నిలుపు కోవాల‌ని చూస్తున్నారు. పైగ మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి ఓసీ మ‌హిళు రిజ‌ర్వ్ కావ‌డంతో క‌మ్మ వ‌ర్గం వారికే ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేలా వైసీపీలో పావులు క‌దుపుతున్నారు. ఈ సారి నందిగామ‌లో టీడీపీ గెలిస్తే ఉమా ప‌రువు కొంత అయినా నిలుస్తుంది.. లేక‌పోతే ఆయ‌న ప‌రువు సొంతూరు సాక్షిగా మ‌రోసారి పోవ‌డం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: