ఏపిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. మొన్నటి వరకు పంచాయితీ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు ప్రభావం ఇప్పటికీ రాష్ట్రంలో పలు చోట్ల కొనసాగుతుంది. కొన్ని చోట్ల రీ కౌంటింగ్ కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కడప , చిత్తూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ పార్టీ నేతలు చివరి వరకు కూడా గట్టి పోటీని ఇచ్చారు.. ఏకగ్రీవాలు కూడా భారీ గా జరిగాయి.. మొత్తానికి అధికార పార్టీ వైసీపీ కి అనుకూలంగా వచ్చాయి.



ఇది ఇలా ఉండగా ఇప్పుడు పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, 12 నగర పాలక సంస్థలకు వచ్చేనెల 10న జరగనున్న ఎన్నికల కోసం 9,307 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,890 సమస్యాత్మకమైనవిగా, 2,466 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మొత్తం 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులున్నాయి. వీటన్నింట్లో కలిపి 38,09,451 మంది ఓటర్లు ఉండగా, వారి లో 18,61,212 మంది పురుషులు, 19,47,507 మంది మహిళలు, ఇతరులు 732 మంది ఉన్నారు. 


ఇక 12 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుష ఓటర్లు 25,97,852 మంది, మహిళా ఓటర్లు 26,53,762 మంది, ఇతరులు 741 మంది ఉన్నారు.. వీరి కోసం ఏర్పాటు చేయబోతున్న 5,020 పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మకం 1,465, అత్యంత సమస్యాత్మకం 1,159, సాధారణమైనవి 2,396గా అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేయనున్న 5,020 పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మకం 1,465, అత్యంత సమస్యాత్మకం 1,159, సాధారణమైనవి 2,396గా అధికారులు వెల్లడించారు.. అప్పుడే ఎన్నికల తంతు రాష్ట్రంలో మోగిపోతుంది..రాజకీయ నేతలు ప్రచారం పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: