ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆయనకు అసలు విషయాన్ని చెప్పారని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో జగన్ కు ముందే సమాచారం ఉంది అని కొన్ని పత్రికలలో కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి ఈ విషయంలో వెనక్కు తగ్గాలని ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక అడుగు కూడా వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

విశాఖ ఉక్కు పరిశ్రమ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలను కూడా జగన్ ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు దృష్టి పెట్టలేదు అంటే మాత్రం భవిష్యత్తులో వైసీపీ చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ బహిరంగ సభ ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో తాను కూడా పోరాటం చేస్తున్నాను అని చెప్పడానికి జగన్ ప్రయత్నం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: