కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇప్పుడు చాలా వరకు కూడా కొంత మంది కేంద్ర మంత్రులకు అవగాహన లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరే వాటి విషయంలో రాష్ట్రాలకు వాస్తవ పరిస్థితులను వివరించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది మంత్రుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రాలు కూడా అడ్డుకోవడానికి ప్రధాన కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడమే. అక్కడున్న స్థానిక ప్రభుత్వాలకు స్థానిక నాయకులు అవగాహన లేకపోవడమే అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని శాఖలకు చెందిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళలేక పోవడంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా సీరియస్ గా ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి కొన్ని కొన్ని కీలక అంశాల మీద చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక మంత్రులను కూడా ఆయన కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మరికొంత మంది సహాయ మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సంక్షేమ కార్యక్రమాలను పెద్దగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు అని టాక్. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చూస్తున్నా సరే ఆయన ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నారట. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: