ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు వెనుకడుగు వేస్తున్నారు అనే భావన ముఖ్యమంత్రి జగన్ లో ఎక్కువగా ఉన్నది. తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సరైన తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో వెనుకడుగు వేయడంపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని ఒక్కమాట కూడా అనని ఎమ్మెల్యేలు ఎంపీల జాబితాను తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మంత్రులు కూడా ఆ మాట మాట్లాడటం లేదని దీనివల్ల తెలుగుదేశం పార్టీ కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తుందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ప్రభావం చూపించింది. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని గ్రహించలేని చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మంత్రుల మీద చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రులు పెద్దగా కనపడటం లేదు. తెలుగుదేశం గతంలో కంటే కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని తెలుసుకోలేని చాలామంది మంత్రులు సోషల్ మీడియాలో ఉండటంలేదు. కొంతమంది మంత్రులకు అయితే అభిమానులు మెయింటైన్ చేస్తున్న ఖాతాలు మినహా వ్యక్తిగతంగా ఒక్క ఖాతా కూడా లేదు అని దీనిపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారని వైసీపీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికారులు మాట కూడా వినడం లేదని అధికారులు చెప్పిన సరే పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: