తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. వాళ్ళు ఎప్పుడు పార్టీ మారతారు ఏంటనే దానిపై తెలియకపోయినా రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మాత్రం ఆల్లు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికే ఇదే విషయాన్ని చెప్పారని కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చర్చలు జరిపినా సరే కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఆసక్తి చూపించడం లేదు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే... కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీలో కంటే కూడా ఆయన కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళాలి అని భావించిన అందుకు తగిన విధంగా పరిస్థితులు కనపడటం లేదని అలాగే బీజేపీ లోకి వెళ్తే తనకు ఇబ్బందులు ఉంటాయి అని ఆయన భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ జన సమితి లో కి వెళ్తే మంచి ప్రాధాన్యత ఉంటుందని తన అనుభవానికి కోదండరామ్ మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోదండరామ్ కి సమాచారం కూడా పంపించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: