తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని ప్రక్షాళన చేసే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతున్నది. కొంతమంది బీజేపీ నేతలు టిఆర్ఎస్ పార్టీ నేతలతో ముందు నుంచి కూడా స్నేహం చేస్తూనే ఉన్నారు. దీని కారణంగా పార్టీ ముందుకు వెళ్లలేక పోతుంది అనే ఆవేదన బండి సంజయ్ లో ఎక్కువగా ఉంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. కొంతమంది ని ప్రోత్సహిస్తున్న సరే కేంద్ర ప్రభుత్వం కొంత మందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న సరే వాళ్ళు మాత్రం పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే ఆవేదన ఆయనకు ఎక్కువగా ఉంది.

దీనితో కొంత మందిని పార్టీ నుంచి బయటకు పంపించే ఆలోచన బండి సంజయ్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొంతమంది నేతలను ఎన్ని విధాలుగా ముందుకు నడిపించాలని భావించిన సరే సీఎం కేసీఆర్ కు భయపడి కేసీఆర్ ను విమర్శించే విషయంలో వెనుకడుగు వేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. దీనిపై బీజేపీ వర్గాలలో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ఆవేదన బండి సంజయ్  లో ఎక్కువగా ఉందంటున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న సరే తనకు చేయూతనిచ్చే విషయంలో చాలామంది నేతలు ఫెయిల్ అవుతున్నారు అని ఆవేదన ఉంది.

అందుకే ఇప్పుడు ఒక కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఆయనకు కొన్ని హెచ్చరికలు పంపినా టిఆర్ఎస్ పార్టీ నేతలతో సావాసం చేస్తూనే ఉన్నారని దీనివలన పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుందనే  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పార్టీ బలపడాలంటే ఇలాంటి అంశాలలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అందుకే ఆయన కొంత మందికి నేరుగా అని వార్నింగ్ ఇచ్చినట్టు గా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: