మన దేశంలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం అనేది పెద్దగా సాధ్యమయ్యే పని కాదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ వెనకబడి ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా ఫోకస్ చేసిందో ఏపీ మీద... కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే దృష్టి పెట్టిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను చాలా జాగ్రత్తగా గమనించింది అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కాస్త ప్రభావం చూపించారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రహించినది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా నాలుగు దశాబ్దాలకు పైగా పరిపాలన చేసింది. కానీ ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలామంది బయటకు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో ఆ పార్టీ అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలు ఈ విషయంలో ఆ పార్టీ అధిష్టానం కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాయలసీమలో కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తే వారికి ప్రోత్సాహం కూడా అందించాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఎందుకు ఏంటనేది తెలియకపోయినా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది అని అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అవకాశాల కోసం చూస్తుందని అంటున్నారు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే భావన చాలా మందికి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: