దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తుంది అనే భావన రాజకీయ వర్గాలు ముందు నుంచి కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దేశంలో భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల్లో అనుకూల పవనాలు వీస్తున్న సరే ఆ పార్టీ మాత్రం చేస్తున్న తప్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలు అనేవి చాలా కీలకంగా మారాయని చెప్పాలి.

ప్రతి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో అసహనం అనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రాల్లో పెన్షన్లను దాదాపుగా పెంచిన పరిస్థితి ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం పెన్షన్ ల విషయంలో రెండు వందలు మాత్రమే ఇవ్వడం అలాగే గృహ నిర్మాణాల విషయంలో రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించకపోవడం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్దగా నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ తీరుపై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగితే కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ నేతలు కూడా విబేధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బిజెపి ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుంది. దీనితో కర్ణాటక ముఖ్యమంత్రి బహిరంగంగానే ఇప్పుడు అసహనం వ్యక్తం చేయడానికి సిద్ధమైనట్లుగా కూడా సమాచారం. పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇలాగే పరిస్థితులు ఉండటంతో దీనిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అసహనంగానే ఉన్నారు. గృహ నిర్మాణాల విషయంలో కూడా సహకారం అందించకపోతే ఎలా అంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగానే అసహనం వ్యక్తం చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: