భారతదేశంలో కరోనా వైరస్ కేసులు త్వరలోనే గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఇండియన్ రైల్వే శాఖ తమ సేవలను పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే దిశగా ముందు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే గుంటూరు - కాచిగూడ - గుంటూరు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలును ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభించనున్నది. లాక్ డౌన్ కి ముందుగానే ఈ ట్రైన్ ని ప్రారంభించారు. కానీ కరోనా వైరస్ వలన ఈ ప్రత్యేక రైలు దాదాపు ఏడాది కాలం పాటు పక్కన పెట్టేశారు.

 
 ఐతే ఈ ట్రైను ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో గుంటూరు నుంచి బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, కర్నూల్‌ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ మీదుగా ప్రయాణించనున్నది. ఐతే ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అదే రోజున కాచిగూడ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, జోగులాంబ గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట మీదుగా ప్రయాణించి ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 6.45కి గుంటూరు కి చేరుకుంటుంది.
 

ఇకపోతే ప్రస్తుతం కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్ లు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. కానీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్లను కూడా నడిపించడానికి భారతీయ రైల్వే శాఖ సిద్ధమయ్యింది. దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందితే అప్పుడు ప్యాసింజర్ రైళ్లను పూర్తిస్థాయిలో నడిపించవచ్చు. ఒక ఏడాది పాటు రైల్వే  సేవలు పూర్తిగా ఆగిపోవడంతో రైల్వే శాఖకు ఆర్థికంగా బాగా నష్టాలు వాటిల్లాయి. కానీ కరోనా కేసులు తగ్గడంతో వాటిల్లిన నష్టాలను పూడ్చడానికి రైల్వేశాఖ నడుంబిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: