పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మెరిసింద‌నే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క సీటుకే ప‌రిమిత‌మైన జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ అనుహ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మాత్రం అంచ‌నాల‌కు మించి స్థానాలు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీ గ్రౌండ్‌లెవ‌ల్లో ప‌టిష్ఠంగా ఉంద‌నే విష‌యానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌న్న అభిప్రాయం నాయ‌కుల్లో వెలువ‌డుతోంది. దీంతో ఇదే ఊపును కొన‌సాగిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని గాడిన పడేసి అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీకి ధీటుగా నిల‌ప‌వ‌చ్చ‌న్న చ‌ర్చ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతోంది. అయితే పార్టీ అనుహ్యంగా బ‌లోపేతం కావ‌డానికి మాత్రం కొన్ని కార‌ణాల‌ను నాయ‌కులు విశ్లేషిస్తున్నారు.


 ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ జిల్లాల్లో ప‌ర్య‌టిస్తుండ‌ట‌మే కాకుండా ఆయా స‌మ‌స్య‌ల‌పై పోరాటాల‌కు దిగ‌డం, ప్ర‌భుత్వ విధానాల‌ను, వైఫ‌ల్యాల‌ను జ‌న‌క్షేత్రంలో ఎండ‌గ‌డుతున్నారు. స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని కూడా చెబుతుండ‌టం విశేషం. అలాగే ప్ర‌తిప‌క్ష చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో కూడా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాద‌న్న అభిప్రాయంతో జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ప్ర‌జ‌లు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌న్న విశ్లేష‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. జ‌న‌సేన పార్టీ గ్రౌండ్ లెవ‌ల్లో చేప‌ట్టి ప‌ర్య‌ట‌న‌లు కూడా లాభిస్తున్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన బ‌లోపేతానికి త్వ‌ర‌లో ప‌వ‌న్ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ముఖ్య నేత‌లు స్పందించాల్సి ఉంది.


ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా జరిగిన ఎన్నికలలో జనసేన మద్ధతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. నాలుగు విడ‌త‌ల్లో జ‌రిగిన పోలింగ్‌లో సర్పంచులు 1209, ఉప సర్పంచ్ పదవులు 1576, వార్డులు 4456 గెలిచామని ఆపార్టీ వెల్లడించింది. అంతేకాదు, మొత్తం మీద 27 శాతం! విజయాల్ని సొంతం చేసుకున్నామని తెలిపింది. అంతేకాదు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పార్టీ మద్ధతుదారులు సాధించిన విజయాల్ని లెక్కలతో సహా పేర్కొంది. పంచాయతీ ఎన్నికలలో జనసేన విజయాలు ఇవే. సర్పంచు స్థానాల్లో 1209, ఉప సర్పంచ్ స్థానాల్లో  1576, వార్డులు 4456 స్థానాల్లో విజ‌యం సాధించిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: