తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్  లోని నరసరావుపేట పట్టణానికి సంబంధించిన బంగారం వ్యాపారులు వ్యాపార నిర్వహణ కోసం తెలంగాణలోని మంచిర్యాల వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగారం వ్యాపారస్తులు అయిన కొత్త శ్రీనివాసరావు, కొత్త రాంబాబు అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో వీరి గుమస్తా ఆయన సంతోష్ అలాగే కార్ డ్రైవర్ అయిన సంతోష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్ రహదారి మీద ఉన్న ఒక డివైడర్ను కార్ ఢీ కొనడంతో వంద అడుగుల దూరంలో ఉన్న ఒక సైన్ బోర్డు ను ఢీకొని పక్కనున్న కాలువలో బోల్తా పడింది. 

ఈ అన్నదమ్ములిద్దరూ చెన్నై తదితర ప్రాంతాల్లో బంగారాన్ని కొనుగోలు చేసి దానితో బంగారు ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. అలానే బంగారు నగలతో మంచిర్యాల వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో దాదాపుగా బంగారం అంతా రోడ్డు పాలయింది. అయితే వీరిని ఆసుపత్రికి తరలించడానికి కోసం వచ్చిన 108 సిబ్బంది మూడు కేజీల 300 గ్రాములు కిలోల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు. 

అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్లు దాదాపు ఏడు కిలోల బంగారంతో మంచిర్యాల వెళుతున్నారని చెబుతున్నారు. అయితే రెండు కిలోల బంగారం కనిపించడం లేదని మాత్రమే వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక కిలో బంగారు నగలను గుమస్తా సంతోష్ జేబులో గుర్తించారు 108 సిబ్బంది. బహుశా అలానే ఇంకా ఎక్కడ అయినా ఉన్నాయా అనే దానిమీద ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. ఇక పోలీసు కేసు నమోదైన నేపథ్యంలో 108 సిబ్బందిని అలాగే ప్రమాద సమయంలో చుట్టూ గుమిగూడిన స్థానికులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: