ఎన్టీఆర్ హయాం నుంచి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశానికి నందమూరి కుటుంబానికి పెట్టని కోట అని చెబుతూ ఉంటారు.. అయితే మరి కొద్ది రోజులలో హిందూపురం నియోజకవర్గంలో హిందూపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలయ్యకు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రంగనాయకులు నిన్న రాత్రి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైసిపిలో చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టిడిపి తరఫున తొలిసారిగా రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఆ తరువాత 2004లో కూడా ఆయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2009లో ఆయనను కాదని అబ్దుల్ ఘని అనే ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే బాలకృష్ణ ఎంట్రీ తర్వాత ఆయన కాస్త సైలెంట్ గా నే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే మొన్న పార్టీ ఓటమి ఓటమి చెందిన అప్పటి నుంచి ఆయన కాస్త పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు  ఆయన వైసీపీలో చేరడం ఇప్పుడు టిడిపికి కచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

నిజానికి ఈయన 1983లో నేత తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే  టిడిపి చీఫ్ నందమూరి తారకరామారావు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి అలాగే హిందూపురం నుంచి పోటీ చేయడంతో అప్పట్లో ఈయన ఎన్టీఆర్ వెనక నడిచారు. అయితే ఎన్నోసార్లు పార్టీ ఆయనను పక్కన పెట్టినా ఆయన పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారు. మరి అలాంటిది ఇప్పుడు ఆయన పార్టీ మారడం వెనుక ఏమి కారణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చేస్తున్నప్రయత్నాలు మాత్రం స్పష్టం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: