అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా తాడిపత్రి మున్సిపాలిటీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం అక్కడ ముఖ్య నాయకులు వార్డు కౌన్సిలర్లు గా రంగంలోకి దిగడమే. నిజానికి తాడిపత్రి మున్సిపాలిటీకి దేశం లో నెంబర్ వన్ గా నిలిచిన మున్సిపాలిటీగా పేరుంది. ఇది ఒక రకంగా జేసీ బ్రదర్స్ కు కంచుకోట అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అధికారంలో వైసిపి ఉండడంతో ఇప్పుడు పోటీ రసవత్తరంగా మారింది.. గత ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించాడు. అదీగాక జగన్ మానియా మంచి ఊపు మీద ఉన్న కారణంగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత జెసి ఫ్యామిలీ ఈసారి ఎలా అయినా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఈ ఎన్నికలలో జెసి ప్రభాకర్ రెడ్డి 'మన ఊరు మనం కాపాడుకుందాం' అనే కొత్త నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నారు. ఆయన ఇప్పటికే ఒక వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఇక అటు పక్క వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు సైతం ఒక వార్డ్ మెంబర్ గా పోటీ లో ఉండడం ఆసక్తికరంగా మారింది. ఎలా అయినా గెలుస్తాను అనే నమ్మకంతో ఉన్న ఆయన చైర్మన్ రేస్లో వైసీపీ నుంచి ముందు వరుసలో ఉన్నాడు. 

అయితే వైసీపీ నుంచి చైర్మన్ పదవి ఆశించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.. ఇక ఎలాగూ టీడీపీ తరపున జేసీ ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు కాబట్టి టిడిపి తరఫున ఆయన చైర్మన్ అభ్యర్థి అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు వైసీపీలో రెబల్స్ బెడద కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఎలా అయినా గెలుస్తామనే నమ్మకంతో చాలా మంది వైసీపీ తరఫున నామినేషన్లు వేశారు. ఇప్పుడు వారందరి చేత నామినేషన్ విత్ డ్రా చేయించడం అనేది తలనొప్పిగా మారింది. ఒక వేళ వారి చేత నామినేషన్ విత్ డ్రా చేయించడం కుదరని పక్షంలో కచ్చితంగా ఇది తలనొప్పిగా మారే అవకాశంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: