అనంతపురం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గుత్తి మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆసక్తి నెలకొని ఉంది. దానికి కారణం గుత్తి మున్సిపల్ ఎన్నికలలో ఎక్కువగా స్వతంత్రులు పోటీలో ఉండడమే. ప్రజా సేవ చేయాలని కొంతమంది అలాగే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించేందుకు మరికొంత మంది ఈ పోటీల్లో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అదీగాక ఈ సారి చైర్మన్ పీఠం జనరల్ మహిళలకు కేటాయించడంతో చాలామంది నాయకులు ఇప్పటికీ తమ భార్యలను రంగంలోకి దింపారు.. దీంతో చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉంది. కొంత మంది అభ్యర్థులు తమ పోటీదారుల ఓట్లు చీల్చి వారిని ఓడించేందుకు గాను తమ మద్దతుతో కొంత మందిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపారు. 

స్వయంగా వారే డిపాజిట్లు చెల్లించి మరీ తమ మద్దతుదారులను తమ వార్డులోనే పోటీ చేయించడం ఆసక్తికరంగా మారింది. అందుకే గుత్తి మున్సిపాలిటీ చరిత్రలో లేనటువంటి లేనివిధంగా 39 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ ఈ స్వతంత్ర అభ్యర్థుల గెలిస్తే గనుక ప్రధాన పార్టీలు చైర్మన్ పీఠాన్ని సాధించడానికి కూడా వీరు కీలకం కానున్నారు. నిజానికి గత మున్సిపల్ ఎన్నికలలో 11 మంది వైసిపి కౌన్సిలర్ లు గెలిచారు. అయితే తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది కౌన్సిలర్లు గెలిచినా ఐదుగురు స్వతంత్రుల మద్దతు చైర్మన్ ఎన్నికలో కీలకంగా అయింది. 

అందుకే ఒక వైసిపి, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో తెలుగుదేశం పార్టీ అప్పట్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కూడా మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో వైసీపీ నుంచి 38 తెలుగుదేశం నుంచి 37 మంది బరిలో ఉన్నారు. అలాగే సిపిఎం నుంచి ఒకరు ఎంఐఎం నుంచి ఒకరు కలిపి మొత్తం 39 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. అయితే ఎక్కువగా స్వతంత్రులు తమంతట తాము బరిలోకి దిగలేదని నాయకుల ప్రోద్బలంతోనే బరిలోకి దిగారు అనే వాదన వినిపిస్తోంది. దానికి కారణం చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల వార్డులలోనే ఎక్కువగా స్వతంత్రులు నామినేషన్ వేయడం. ఈ నేపథ్యంలోనే కావాలనే స్వతంత్రులు నామినేషన్లు దాఖలు అయ్యేలా చేశారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: