జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ లో 2600 ల ఎకరాల రైతుల భూములను వెన్నక్కి ఇస్తామని చెప్పడం తో జనసేన పార్టీ ఆనందం గా ఉంది అని ఆయన అన్నారు. ఆరోజు మీరు తీసుకున్న భూములు  పది వేల ఎకరాలు అప్పుడు నష్ట పరిహారం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు అని ఆయన వెల్లడించారు. 45 రోజులు రైతుల జైల్లో ఉంటే ఏమైంది క్యాబినెట్ సబ్ కమిటీ అని నిలదీశారు.

ఇదంతా ప్రణాళిక బద్దంగా దోచుకోడానికె అని అన్నారు. గతం లో దివిస్ ని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారు ఇప్పుడు కాకినాడ సెజ్ లో మీ పాత్ర ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు తూర్పుగోదావరి ప్రాంత వాసులను ఇలా భాధపెడుతున్నారు  అని నిలదీశారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో దివిస్ వెనుక జరుగుతున్న కుట్రలను బయట పెడతాం అని అన్నారు. జరిగిన పంచాయితీ ఎన్నికలలో చూసాం మీరు ఏ రకంగా జరిపారో అని ఆరోపించారు. ఈబిసి రేసర్వేషన్ గురించి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రస్తావించట్లేదు అని ప్రశ్నించారు.

ప్రతి గ్రామంలో జనసేన తరఫున మహిళలు చాలా అద్భుతంగా పనిచేశారు అని ఆయన అన్నారు. ప్రధానంగా దివిస్ విషయం లో జనసేన పార్టీ పూర్తి వివరాలతో,ప్రజల తరఫున కచ్చితంగా పోరాడతాము అని స్పష్టం చేసారు. జగన మోహన రేడ్డి గారి క్యాబినేట్ మీటింగు తూతూమంత్రంగా జరిగింది అన్నారు. ప్రజలను మబ్బే పేట్టే విధంగా ఉంది అని ఆరోపించారు. దివిస్ కోసం వ్యతిరేకంగా పోరాడిన పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు క్యాబినట్ కమిటీ రిపోర్టు నిన్న సమర్పించడం దారుణం అని అన్నారు.  ఇన్ని రోజులు ఏమీ చేసారు కన్నబాబు అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: