పాస్ పోర్ట్ స్కాం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ స్కాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన మీడియాలో కూడా బిజెపి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాస్ పోర్ట్ స్కాంపై ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయనున్నారు సైబరాబాద్ సీపీ. ఆధార్ కార్డు పొందడంలో ఉన్న లూపోల్స్ పై అధికారులకు లేఖ రాయనున్నారు సైబరాబాద్ సీపీ. ఓకే అడ్రస్ పై 32  పాస్ పోర్టులు జారీ అయితే ఎవ్వరూ గుర్తించకపోవడం నిఘా సంస్థల వైఫల్యం ? చెందింది అని అనుమానాలు ఉన్నాయి.

ఇంటలిజన్స్, ఎస్.బి నిఘా వైఫల్యం బయటపడింది. నకిలీ దృవీకరణ పత్రాలు పొంది ఆధార్ కార్డులు సృష్టించారు బంగ్లా దేశీయులు. యథేచ్ఛగా భారత్ లోకి అక్రమంగా చొరబడి వెస్ట్ బెంగాల్ లో నకిలీ ఐడిక్రియేట్ చేసుకున్నారు అని గుర్తించారు. అక్కడ ఆధార్ కార్డులు తీసుకుని చేంజ్ అప్ అడ్రస్ బోధన్ లో చేసుకున్నారు అని వివరించారు. బోధన్ లో పోలీసులను మ్యానేజ్ చేసుకుని పాస్ పోర్టులు తీసుకున్నారు అని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధిచిన అంశం కావడంతో ఈ వ్యహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

 72 మందిలో 19 మంది దేశం వదిలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు... వారిని గుర్తించే పనిలో పడ్డారు. మిగతావారు ఎక్కడ ఉన్నారు..? అనేది ఇంకా బయట పడలేదు అని పోలీసులు అంటున్నారు. బోధన్ లో ఒక అడ్రస్ పైన 37 పాస్ పోర్టులు తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు... ఇప్పటికే 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: