అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో ఎటువంటి సంబంధాలు ఉంటాయి అనే దానికి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో భారత్ తో సంబంధాలు చాలా బాగున్నాయి. అయితే బిడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత మోడీ తో కాస్త దూరం పాటిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ విధానాల విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా కూడా అలాగే అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించేవి.

 ఇటీవల ఆమె మేనకోడలు మన విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అమెరికా మాత్రం భారత్ విషయంలో కాస్త దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చైనాను కట్టడి చేసే విషయంలో అమెరికా దూకుడుగా ముందుకు వెళ్ళినా సరే అందుకు తగిన విధంగా పరిస్థితులు కనపడలేదు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం ఆ దేశాన్ని కట్టడి చేయాలి అంటే భారత్ వల్లే సాధ్యమవుతుందని ఆర్థికంగా అయినా  సైనికంగా అయినా సరే సామాజికపరమైన సరే దూకుడుగా వెళ్లే దేశం భారత్ అని అమెరికా గ్రహించింది అంటున్నారు.

అందుకే క్వాడ్ దేశాలు కూటమిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా, జపాన్, భారత్ అమెరికా లతో ఉన్న ఈ కూటమిలో ఇప్పటి వరకు కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఇకముందు మాత్రం అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు అమెరికా జోక్యం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పటివరకు మోడీతో తమకు అవసరం లేదని భావించిన అమెరికా అధ్యక్షుడు ఇకనుంచి మాత్రం మోడీకి సన్నిహితంగా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: