ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు మంత్రులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఏదైనా ఆరోపణలు చేస్తే కచ్చితంగా దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. మీడియాకు పచ్చ మీడియా అని ముద్రవేసి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది మంత్రులు మాత్రం తమ వైఖరి మార్చుకున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తాజాగా ఆయన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి స్కూల్స్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. అయితే కొన్ని కొన్ని పనులు ఆలస్యం అయ్యాయి అని రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లో కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ అది అంత వాస్తవమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకు ఆలస్యం అయ్యాయి అనే దానిపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. నాడు-నేడు కార్యక్రమం విషయంలో ఆయన ముందు నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.

గతంలో అధికారిగా పనిచేసిన ఆయన నాడు నేడు కార్యక్రమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు తగినట్లుగా పనిచేయడమే కాకుండా స్కూల్స్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన స్వయంగా జోక్యం చేసుకుంటున్నారని ఇక స్కూల్స్లో మౌలిక సదుపాయాల విషయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రి జోక్యం చేసుకోవడంతో విద్యాశాఖ అధికారులు కూడా కాస్త స్పీడ్ గా నీ అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఏది ఎలా ఉన్నా సరే వైసీపీలో ఇప్పటివరకు కూడా మంత్రులందరూ మీడియాను నానారకాలుగా విమర్శిస్తూ ఉండేవారు. కానీ మంత్రి వైఖరి లో మాత్రం మార్పు రావడం పై చాలా వరకు కూడా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే కొనసాగితే బాగుంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: