ఇన్ని రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ప్రభావం గురించి ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ముందు నుంచి కూడా వెనకబడి ఉంది. 2014లో పోటీ చేయకపోవడం 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పెద్దగా ఎన్నికల విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి జరిగాయి. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే పెద్దగా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. దీని పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ మంచి ప్రభావం చూపించింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా జనసేన పార్టీ ప్రభావం కనబడింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా వరకు కూడా జనసేన పార్టీ కార్యకర్తల బలం తో ఎక్కువగా పంచాయతీలను గెలుచుకుంది. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా జనసేన పార్టీ ప్రభావం కనబడింది అనే మాట వాస్తవం. నాలుగు జిల్లాల్లో కూడా జనసేన పార్టీ ద్వితీయ స్థానంలో ఎక్కువగా నిలబడటం జరిగింది.

ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే తెలుగుదేశంకు బలం ఉన్న నియోజకవర్గాల్లో కూడా కాపు సామాజికవర్గం మొత్తం జనసేన పార్టీకి మద్దతు ఇచ్చింది. దీనితో జనసేన పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తుంది అని చెప్పాలి. ఇక జనసేన పార్టీ కి డబ్బులు లేకపోయినా పెద్దగా నాయకత్వ బలం లేకపోయినా సరే గ్రామాల్లో ప్రభావం చూపించడంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ద్వితీయ స్థానా ల్లో జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో నిలబడటం పై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేదానిపై మాత్రం ఇంకా జనసేన పార్టీ స్పష్టత ఇవ్వడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: