తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పని తీరుపై తెలుగుదేశం పార్టీ వర్గాలు అన్ని కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత అని పెద్దగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా ప్రజలలో తిరిగి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో నారా లోకేష్ విఫలమవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నారా లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు అందరూ కూడా కాస్త అసహనంగా ఉన్నారనే ప్రచారం ఈ మధ్యకాలంలో ఉంది.

అయితే ఇప్పుడు కొన్ని మార్పులు నారా లోకేష్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు పదవుల ఎంపిక విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు గానీ... ఇక ముందు మాత్రం కచ్చితంగా జోక్యం చేసుకునే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు ఆయన కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నియోజకవర్గాల్లో సర్వే చేయించే ఆలోచనలో కూడా నారా లోకేష్ అన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొన్ని కీలక బాధ్యతలను అప్పగించాలని ఆయన ఒక జాబితాను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారట.

మాజీ ఎమ్మెల్యేలు అందర్నీ కూడా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సర్వే చేయించాలీ అని చెప్పినట్టుగా సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యేలకు చెప్పడం వెనుక మరో కారణం ఉంది అని అంటున్నారు. ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటివరకు నారా లోకేష్ పెద్దల జోక్యం చేసుకోలేదు. కానీ మాజీలకు వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అందుకే ఆరుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్యేలు అందరి ద్వారా ఈ సర్వే చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే దానిపై ఆయన నేరుగా మాజీ ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం మీడియా వర్గాలకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: