తెలంగాణాలో వైఎస్ షర్మిల కాస్త స్పీడ్  పెంచారు. లోటస్ పాండ్ లో ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో ఆమె సమావేశాలు నిర్వహిస్తూ వారికీ పలు సూచనలు చేయడం వారి నుంచి సలహాలు తీసుకోవడం వంటివి ఆమె చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఆమె యువత ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. లోటస్ పాండ్ లో విద్యార్థులతో ప్రారంభం అయిన షర్మిల ముఖా – ముఖి నిర్వహించారు.

ఉస్మానియా యూనివర్శిటీ తో పాటు వివిధ కాలేజీల నుంచి భారీగా తరలి వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. నిరుద్యోగం ,ఫీజ్ రీయంబర్స్ మెంట్ పై చర్చ జరిగింది. మీ అక్కగా మన సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న అని అన్నారు. తెలుగు ప్రజలను అందరినీ రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు అని ఆమె వెల్లడించారు. డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దు అని వైఎస్ బరోసా కల్పించారు అని ఆమె గుర్తు చేసారు. ఫీజ్ రిఎంబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేది అన్నారు.

నేడు ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అని ఆమె చెప్పుకొచ్చారు. వాళ్లంతా ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారు అని అన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్సార్ ది అన్నారు. అక్షరం గుండెల్లో ఇప్పటికీ వైఎస్సార్ బ్రతికే ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజం కావాలి అన్నారు. తెలంగాణ లో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు. అందరి నిరీక్షణ ఫలించాలి అంటే ఒక మంచి సమాజం రావాలి  అని ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: