ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖామంత్రి, కన్నబాబు కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. అయితే కేబినేట్ సమావేశం తర్వాత మాత్రం మంత్రి కాస్త స్పీడ్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని అంశాల గురించి ఆయన మాట్లాడారు. అమరావతి బాహుబలి డిజైన్ అని అన్నారు. ఉన్నంత వరకూ పనులన్నీ ఒక కొలిక్కి తేవాలని ప్రభుత్వం చూస్తోంది అని ఆయన స్పష్టం చేసారు.

చంద్రబాబు సీఎం జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని చెప్పలేదు మా ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేసారు. చంద్రబాబు కు డబుల్ స్టేట్మెంట్ లు ఉంటాయని అన్నారు. పంచాయితీ ఎన్నికలలో వైసీపీ కి భారీ మెజారిటీ తీర్పు వచ్చింది అని ఆయన వెల్లడించారు. ఏకపక్ష తీర్పుగా 80 నుంచీ 85 శాతం వైసీపీ కి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. మునిసిపల్ లో కూడా అదే తీర్పు వస్తుంది అని ఆయన అన్నారు. మునిసిపల్ ఎన్నికల కోసం అమరావతి అనలేదు వైసీపీ అని ఆయన స్పష్టం చేసారు.

అద్దంకి లో వాలంటీర్ వ్యవస్ధ ఉండదు అనేది చంద్రబాబు మాటలే..‌ అలాంటిదేం జరగదు అని ఆయన అన్నారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా రిజల్ట్ ఓకటే ఉంటుంది అని అన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన ఆయన పరిస్ధితిని రిపేర్ చేసుకోవడానికే అని ఆయన వెల్లడించారు. ఎస్ఈసీ ఎంత ప్రయత్నించినా సూర్యుడికి చేయి అడ్డు పెట్టి వెలుగును ఆపలేరు అన్నది తేటతెల్లం అయింది అని పేర్కొన్నారు. ఏసీబీ అస్మదీయుల ఏసీబీ కాదు అని ఆయన స్పష్టం చేసారు. శ్రీశైలం తరువాత దుర్గగుడిలో సోదాలు జరుగుతున్నాయి అని, నిజమైన రైతులు మా భూములు ఇమ్మంటారు.. కనుక కాకినాడ సెజ్ రైతులు తరిగిమ్మని అడిగారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: