టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కాస్త రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సర్కార్ చేస్తున్న కొన్ని కార్యక్రమాలను ఆయన పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన కొన్ని కార్యక్రమాలను ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రశాంతతకు పాతరేసి.. అరాచకాలకు పట్టం కడుతున్న జగన్ పాలన అంటూ ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేసారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని  జగన్ రెడ్డి రావణ కాష్టం చేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు. స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడు అని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల దాడిలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ టీడీపీ కార్యకర్త సోమయ్య మరణించడం అత్యంత బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  

కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలంలోని గొల్లమందల పంచాయితీలో 21-02-2021న జరిగిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో టీడీపీ వార్డు మెంబర్ అభ్యర్ధి పాలకొల్లు నాగమల్లేశ్వరరావు తండ్రి సోమయ్యను (రజక సామాజికవర్గం) కర్రలతో కొట్టడంతో రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మరణానికి నూటికి నూరుశాతం జగన్ రెడ్డే బాధ్యత వహించాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు అని ఆయన నిలదీశారు. దాడికి పాల్పడి ప్రాణాలు తీసిన వారిపై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేసారు.  మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: