మన బడి నాడు – నేడుపై  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాద్‌ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు హాజరు అయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలి అని సిఎం ఆదేశించారు. నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూల్స్‌ ఫొటోలు పరిశీలించారు.

సెకండ్‌ ఫేజ్‌లో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి అని ఆయన ఆదేశించారు.  కమిటెడ్‌గా పనిచేయాలి అని అప్పుడే అనుకున్న ఫలితాలు సాధిస్తాం అని సిఎం అన్నారు. నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలి అని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి సీఎం ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత స్కూళ్లలో టాయిలెట్ల శుభ్రతపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామన్న అధికారులు... మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్‌ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అధికారులు వివరించారు. విద్యార్ధుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోంది అని తెలిపారు. మార్చి  15కల్లా మ్యాపింగ్ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. విద్యాకానుకపై సీఎం మాట్లాడుతూ విద్యాకానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలి అని తెలిపారు. అమ్మ ఒడి కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యం అని అన్నారు. సీబీఎస్‌ఈ విధానంపై సీఎం మాట్లాడుతూ... 2021– 22 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: