మొన్నటి వరకు ఆంధ్ర రాజకీయాలలో తెలంగాణ రాజకీయాల్లో సైలెంట్గా ఉండి పోయిన వైయస్ షర్మిల ఇటీవలే తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి కొత్త పార్టీతో ముందుకు రానున్నారు అంటూ సంకేతాలు ఇవ్వడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవలే వైయస్ షర్మిల ప్రకటించారు.  ఇక వైయస్ షర్మిల ఇలా పార్టీకి సంబంధించిన ప్రకటన చేయడంతో అటు ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో విజయవంతంగా కొనసాగుతూ అధికారంలో ఉండగా ఇక ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ఎందుకు కొత్త పార్టీ పెట్టాలని అనుకుంది అనే చర్చ కూడా మొదలైంది. అసలు ఈ పార్టీ పెట్టడం వెనుక జగన్ హస్తం ఉందా లేదా జగన్ కు ఇష్టం లేకుండానే షర్మిల పార్టీ పెడుతున్నారా అనే ఎన్నో రకాల ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సోషల్ మీడియా వేదికగా  మాట్లాడిన వైయస్ షర్మిల దీనిపై క్లారిటీ ఇచ్చారు.



 తాను పార్టీ పెట్టడం తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అస్సలు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు వైయస్ షర్మిల. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో  ముందు వైయస్ జగన్ ను అడగాలి అని సూచించారు. తనకు తన తల్లి వైయస్ విజయమ్మ సపోర్ట్ ఉంది అంటూ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అంటూ వ్యాఖ్యానించిన వైయస్ షర్మిల కెసిఆర్ విజయశాంతి ఎక్కడివారు అంటూ ప్రశ్నించారు. తాను తెలంగాణ కోడలిని అంటూ వ్యాఖ్యానించిన వైయస్ షర్మిల.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి గడపకు వెళ్తాను అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు  ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: