పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నగరం నుండి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ  అభ్యర్థి సురభి వాణి దేవి. ఈమె తెలంగాణ భవన్కు వచ్చారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుమేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నారని అన్నారు. జాతీయ సమస్య లేదు నాకు బాగా తెలుసు అని అంటున్నారు టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.                     



 టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి ఇంకా మాట్లాడుతూ నా నరనరాల్లో ప్రజా సేవ జీర్ణించుకుపోయింది అని ఆమె అన్నారు. నేను ఇప్పటికే విద్యా సంస్థలను స్థాపించి విద్యా సేవ చేస్తున్నాను. 35 ఏళ్లుగా విద్యార్థులను గైడ్ చేస్తూ విద్యా సేవలో మునిగిపోయానని సురభి వాణి దేవి అన్నారు.                                                                                               


 అంతేకాకుండా గడిచిన 35 ఏళ్ళ లో మా విద్యాలయాల నుంచి లక్షకు పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారని చెప్పుకొచ్చారు. చిన్న అణువు నుంచి అంతరిక్షం వరకు ఉన్న విద్యార్థులు పనిచేస్తున్నారని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.


 35 ఏళ్లుగా గ్రాడ్యుయేట్లు సమస్యలను దగ్గర నుండి చూశాను. కాబట్టి ఇప్పుడు నేను గెలిస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం  అవకాశం దక్కుతుంది అని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు  వాణి దేవి.ఇంకా  మా నాన్నకి రిటైర్మెంట్ సమయంలో ప్రధాని పదవి వచ్చినట్లు నాకు కూడా ఇప్పుడు ఈ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు సురబీ వాణి దేవి

మరింత సమాచారం తెలుసుకోండి: