సత్తా చాటుకోవాలంటే .. కొండనే ఢీకొట్టాలి.. తెలంగాణలో పార్టీ పెట్టదలచుకున్న షర్మిల ఇప్పుడు ఈ పాలసీనే ఎన్నుకున్నట్టున్నారు . ఎందుకంటే.. ఆమె ఇప్పుడు ఏకంగా కేసీఆర్ టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఏదో ఉబుసుపోక పార్టీ పెట్టడం లేదు.. నేను చాలా సీరియస్ అన్న అభిప్రాయం కలిగేలా ఆమె తాజా కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ అంతగా కేసీఆర్‌ను షర్మిల ఏమన్నారంటారా..?

తెలంగాణలో వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు తప్ప తెలంగాణ కేసీఆర్  కొత్త పథకాలు ఏమీ ప్రవేశ పెట్టలేదంటున్నారు షర్మిల. అలాగే .. లాక్ డౌన్ టైం లో హాస్పిటళ్లలో లక్షల్లో  బిల్లులు వసూలు చేస్తుంటే సీఎం ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యాడని ఘాటు కామెంట్లు చేశారు షర్మిల. అంతేనా.. అసలు రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు ఎన్నో కూడా  కెసిఆర్ కు తెలియదంటూ సెటైర్లు పేల్చేశారు షర్మిల. కేసీఆర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీని  పూర్తిగా నిర్వీర్యం చేశారని షర్మిల విమర్శించారు.

త్వరలో తాను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటున్న షర్మిల.. మార్గం మధ్యంలో అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. పార్టీ పెట్టే ముందు అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల.. తాజాగా విద్యార్థి నేతలతో ఆమె సమావేశం అయ్యారు. ఆ సమయంలో కొందరు ఉద్యమంలో అమరులైన వారిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకోకుంటే  తెలంగాణ మీద నాకు గౌరవమ్ లేనట్టా అంటూ షర్మిల ప్రశ్నించారు.

అంతే కాదు.. తాను ఎవరు వదిలిన బాణం కాదని... తాను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు అంతేనని షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. జగన్ కు నాకు పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా లేవని ప్రకటించారు. అన్న ఏపీ సంక్షేమం కోరితే నేను తెలంగాణ కోడలిగా ఇక్కడ రాష్ట్ర సంక్షేమం కోరుతున్నానని.. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. తనకు పార్టీ పెట్టాలనే ఆలోచన గత సంవత్సరం ఆగష్టులో వచ్చిందన్న షర్మిల.. తెలంగాణలో ఎవరైనా  వైసీపీకి సంబంధించిన వారు వస్తే స్వాగతిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: