అనంతపురం జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా రాయదుర్గంలోని ఏడవ వార్డులో నిన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తమ పార్టీ కార్యకర్తలు నాయకులు అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏడో వార్డులో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు ప్రజలను ఏ మేరకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని వివరిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

రాయదుర్గం పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఈ మునిసిపల్ ఎన్నికల్లో మళ్లీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాక ప్రచారంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలుగు దేశం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలను సాధించింది.. ఇదే రకమైన ఫలితాలను మునిసిపల్ ఎన్నికలలో కూడా సాధించడానికి ఆ పార్టీ నాయకులు కష్టపడుతున్నారు. 

మరీ ముఖ్యంగా రాయదుర్గం విషయానికి వస్తే ఇది కాల్వ శ్రీనివాసులు గతంలో పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఈ మునిసిపాలిటీ ఎలా అయినా గెలిపించాలని పట్టుదలలో ఆయన ఉన్నారు. అందుకే వీలైనంతగా ఎక్కువ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలలో చర్చనీయాంశంగా మారుతున్నారు. ఒక పక్క అనంతపురం జిల్లా కి వైసీపీ తరపున గట్టి లీడర్ లేకపోవడంతో దానిని ఎలా అయినా తమకు అనుకూలంగా మార్చుకోవాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇక రాయదుర్గం విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా సీరియస్ గానే ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: