కొన్ని సార్లు ఆకతాయిలు ఫేక్ వీడియోలను షేర్ చేసి జనాలను హడలెత్తిస్తుంటారు. ఎక్కడో జరిగిన సంఘటనలు తీసుకువచ్చి అసలు సంబంధం లేని ప్రాంతాల్లో జరిగినట్టు సృష్టిస్తారు. ఇలాంటి ఘటనలు కరోనా టైమ్ లో ఎక్కువగా జరిగాయి. అయితే అలాంటి ఘటనే ఇప్పుడు తాజాగా  హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని బాలానగర్ లో కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది . వాట్సాప్ లో ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. వీడియోలో ఫ్లై ఓవర్ కింద ఉన్న కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. వాహనాల్లో, ఫ్లై ఓవర్ కింద ఉన్న జనాలు ఆందోళనతో అరుస్తున్నారు. ఇక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో హైదరాబాద్ ప్రజలు ఒక్కటిగా భయాందోళనకు గురయ్యారు. అంతే కాకుండా బాలానగర్ జీడిమెట్ల వైపు వెళ్లొద్దంటూ కూడా కొంతమంది సూచిస్తున్నారు. ఈ వీడియో ఒక్కసారిగా జనాల్లో ఆందోళన రేకెత్తించడం తో వీడియో పై హెచ్ఎమ్డిఏ అధికారులు స్పందించారు .

ఈ వీడియో హైదరాబాద్ లోని బాలానగర్ ది కాదని బాలానగర్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. ఈ వీడియోలో ఉన్న సంఘటన గతేడాది గురుగ్రామ్ లో జరిగిందని చెప్పారు. గురుగ్రామ్ లో సోహ్నో రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కూలిపోయిందని చెప్పారు. దాంతో ఫ్లై ఓవర్ కింద వాహనాలు నుజ్జు నుజ్జయిపోవడంతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే అప్పటి వీడియో ను షేర్ చేసి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ వీడియో ఎవరు షేర్ చేసారని విచారణ జరపగా సనత్ నగర్ లోని ఓ ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ నిందితుడిగా తేలింది. దాంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: