బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఆకట్టుకునే విషయంలో సోము వీర్రాజు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే చూస్తున్నారనే విమర్శలు కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. సోము వీర్రాజు వలన భారతీయ జనతా పార్టీకి  ఎలాంటి ఉపయోగం కూడా కనపడటం లేదు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్లి కొన్ని వివాదాస్పద అంశాలను తీసుకుని వాటి మీద మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేసిన పార్టీకి నష్టం జరుగుతుంది మినహా లాభం ఎక్కడా కనబడటం లేదు అనే చెప్పాలి. అయితే సోము వీర్రాజు విషయంలో పార్టీ అధిష్ఠానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సోము వీర్రాజు విషయంలో చూసీచూడనట్టుగా వదిలేసిన బిజెపి నేతలు ఈ మధ్యకాలంలో దూకుడుగా అడుగులు వేస్తున్నారు.

అయితే సోము వీర్రాజు కొంతమంది కాపు సామాజికవర్గ నేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా సరే ఆ తర్వాత చేయలేదు. జనసేన పార్టీ సహకారం ఉన్న కాపు సామాజికవర్గం నేతలతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆయన విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు అడుగులు వేయనుంది. ఆయనను పదవి నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. సోము వీర్రాజు కి వైసీపీ నేతలు ఎమ్మెల్సీ పదవిని కూడా ఆఫర్ చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. సోము వీర్రాజు ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: