సహజంగా అందరూ రాత్రి త్వరగా నిద్రపోవాలి. తెల్లవారి త్వరగా నిద్రలేవాలి అంటారు. అయితే మారుతున్నకాలానికి అనుగుణంగా చాల మంది ఉద్యోగాలు, ఇతర సమస్యల కారణంగా జనం రాత్రి 10 గంటలు కాదు.. అర్ధరాత్రి ఎప్పుడో 12, ఒంటి గంట వరకు మెలకువగానే ఉంటున్నారు. అయితే, తాజాగా ఓ సర్వేలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే 21 దేశాల్లో 5633 మంది మరణాల మీద సర్వే చేసిన కొందరు సైంటిస్టులు వారి అలవాట్లు, ఇతర అంశాలను ఆరా తీశారు. ఈ సర్వేలో రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారిలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం 9 శాతం పెరిగిందంట. ఈ అంశాన్ని సైంటిస్టులు మెడికల్ జర్నల్ స్లీప్ మెడిసిన్‌లో రాశారు. ఈ సర్వేలో చెక్ చేసిన వారిలో ఎక్కువ మంది రాత్రి 10 గంటల కంటే ముందే మంచం ఎక్కేవాళ్లే. వారిలో కొందరు పెద్దవారు, కొందరు తక్కువ చదువుకున్నవారు, కొందరు మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, పొగతాగేవారు, మద్యం సేవించే వారు ఉన్నారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో రాత్రి 10 గంటల నుంచి 12 గంటల మధ్య నిద్రకుపక్రమించే వారిలో తక్కువ గుండెకు సంబంధించిన సమస్యలు కనిపించాయి. 10 గంటల కంటే ముందే పడుకునే వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు కనిపించాయన్నారు. నిపుణులు చెబుతున్న ప్రకారం త్వరగా నిద్రపోవడం లేదా అత్యంత లేట్ గా నిద్రపోవడం వల్ల కార్డియాక్ రిథమ్ దెబ్బతింటుంది.

నిద్రమీద సహజంగా జనాలకు కంట్రోల్ ఉండదు. కొందరు అలా మంచం మీద వాలగానే నిద్రపోతారు. మరికొందరు మాత్రం అటూ ఇటూ దొర్లిన తర్వాత గానీ నిద్రపోరు. అయితే, మానవ శరీరం రిథమిక్‌గా పగలు, రాత్రికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి, ఇకపై త్వరగా నిద్రపోయి.. త్వరగా నిద్రలేచే అలవాటు ఉన్నవారు ఈ అంశంపై ఒకసారి డాక్టర్‌ను కలిసి మంచి సలహా తీసుకోవడం మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: