ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి నగర పాలక సంస్థలు... మున్సిపల్ ఎన్నికల పైనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసిపి తన పట్టు నిలుపుకుంది. పంచాయతీ ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి తో పాటు... గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే.. ప్ర‌భుత్వ విఫ్‌‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర స్థాయి లో రికార్డులు బద్దలు కొట్టారు. పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీలను వైసీపీ ఖాతాలో ఏకగ్రీవం చేశారు. మాచర్ల లో ప్రభుత్వ విప్ రామకృష్ణారెడ్డి 3 పంచాయతీలు మినహా అన్ని పంచాయతీలను వైసీపీకి ఏకగ్రీవం చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రిగిన ఈ మూడు పంచాయ‌తీలు కూడా వైసీపీయే గెలిచింది.

ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం నామినేషన్లు పూర్తయ్యే సరికి మాచర్ల మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో ఏకగ్రీవం చేసేలా ఆయ‌న దూసుకుపోతున్నారు. పట్టణంలో ఉన్న 31 వార్డులకు 10 వార్డులలో వైసిపి అభ్యర్థులు సింగిల్‌ నామినేషన్ దాఖలు చేశారు. ఈ 10 వార్డులు ఇప్పటికే అధికార వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేసరికి మరో ఐదు వార్డుల్లో వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయితే మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికలు పూర్త‌వ్వ‌కుండానే  వైసీపీ ఖాతాలో పడినట్టే.

ఆ తర్వాత కొన్ని వార్డులకు నామమాత్రంగా ఎన్నికలు జరిగినా మునిసిపాలిటీని ఏక‌గ్రీవం చేసి రాష్ట్రస్థాయిలోనే మరో రికార్డును విఫ్‌ రామకృష్ణారెడ్డి తన ఖాతాలో లిఖించుకున్న వారు అవుతారు. మంత్రి పెద్దిరెడ్డిని మిన‌హా యిస్తే ఆ త‌ర్వాత ఆ రేంజ్‌లో అటు పంచాయ‌తీలు.. ఇటు మున్సిపాల్టీల్లో ఈ స్థాయిలో ఏక‌గ్రీవాలు చేసిన ఏకైక ఎమ్మెల్యేగా రామ‌కృష్ణా రెడ్డి నిలిచిపోతార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: