చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇక టీలల్లో చాల రకాలు పుట్టుకొచ్చాయి. అందులో ఒక్కటి వేపాకు టీ. ఇది చేదుగా ఉండే అద్భుతమైన హెర్బల్ టీ. వేపాకును ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు. అవేంటో ఇక్కడ చూడండి. బ్యాక్టీరియా, వైరస్‌పై వేపాకు చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరంచేస్తుంది. వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన వేపాకు టీ దూరం చేస్తుంది.

అయితే వేపాకు టీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు ఎప్పుడైనా ఒత్తిడిగా ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకున్నా ఒక కప్పు వేప టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. వేపాకులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో వేపాకు టీ చక్కగా పనిచేస్తుంది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను వేపాక్ టీ నిర్మూలిస్తుంది. ఒక కప్పు టీ తాగితే క్యాన్సర్ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

అంతేకాదు.. మీకు చుండ్రు సమస్య ఉంటే.. నీటిలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించాలి. దాన్ని చల్లారనివ్వాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత ఈ వేపాకు నీటితో మరోసారి శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. నీమ్ టీ ఆరోగ్యానికి మంచిదే ఐనా కొందరు దీనిని తాగకూడదు. గర్భంతో ఉన్న స్త్రీలు డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వేపాకే టీని తాగాలి.

ఇరాక్ పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కూడా వేపాకు టీ తాగకూడదు. అవయవ మార్పిడి చేసుకున్నవారు, ఇటీవలే శస్త్రచికిత్స జరిగిన వారు కూడా వేపాకు టీకి దూరంగా ఉండాలి. వేపాకు టీని ఎలా చేయాలంటే.. రెండు కప్పుల నీటితో 6 -10 వేపాకులు వేసి మరిగించాలి. అందులో బెల్లం లేదా చక్కెర వేస్తే చేదుగా అనిపించదు. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నీళ్లు లైట్ గ్రీన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత వేడి వేడిగా తాగితే ఎంతో మంచిది.









మరింత సమాచారం తెలుసుకోండి: