ఇదేంటి ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏంటి... .టీడీపీని గెలిపించ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ? ఇప్పుడు ఇవే మాట‌లు వైసీపీ వాళ్లే అంటున్నారు. ఈ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ తెలుసుకోవాలంటే విజ‌య‌న‌గ‌రం వెళ్లాల్సిందే. వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీర‌భ‌ద్రస్వామికి ఆ పార్టీ నుంచే అసమ్మతి తీవ్రమైంది. వీరభద్రస్వామికి వ్యతిరేకంగా 35 మంది నగర వైసీపీ నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక్క‌డ ముందు నుంచి మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ వ‌ర్గానికి.. వీర‌భ‌ద్ర స్వామికి పొస‌గ‌డం లేదు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి బొత్స‌కు చెక్ పెట్టే క్ర‌మంలో ఆయ‌న ఆయ‌న వ‌ర్గానికి ఒక్క‌టంటే ఒక్క కార్పొరేట‌ర్ సీటు కూడా ఇవ్వ‌లేదు. బొత్స క‌నీసం ఐదారు కార్పొరేట‌ర్లు త‌న వ‌ర్గం నేత‌ల‌కు ఇవ్వ‌మ‌ని అడిగినా కోల‌గ‌ట్ల ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు కోల‌గ‌ట్ల‌కు వ్య‌తిరేకంగా పెట్టిన స‌మావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ స్నేహితులు, అనుచరులు హాజరైనట్లు చెబుతున్నారు. మంత్రి బొత్స అనుచరులమంటూ ఎమ్మెల్యే కోలగట్ల అణచివేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత పిల్లా విజయకుమార్ మండిపడ్డారు.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కోల‌గ‌ట్ల పార్టీని రెండుగా చీల్చేశార‌ని ప‌లువురు అస‌మ్మ‌తి నేత‌లు మండిప‌డ్డారు.  పార్టీకి మొదటి నుండి కష్టపడుతున్న తమకు ఎన్నికల్లో పోటీకి అవకాశమివ్వాలని... పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న త‌మ‌ను కాద‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల జూనియ‌ర్ల‌కు... త‌మ కంటే త‌క్కువ క‌ష్ట‌ప‌డిన వారికే కార్పొరేట‌ర్ సీట్లు ఇస్తున్నార‌ని వారు ఫైర్ అయ్యారు. కేవ‌లం మంత్రి బొత్స తో స‌ఖ్య‌త‌తో ఉంటున్నామ‌న్న సాకుతో త‌మ‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని వారు మండి ప‌డుతున్నారు. ఎమ్మెల్యే తీరుతో కార్పొరేష‌న్ సులువుగా టీడీపీకి వెళ్లిపోతుంద‌ని కూడా వారు చెపుతున్నారు. మ‌రి ఈ వివాదం ఎలా మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: