ఈ మధ్య కాలంలో జనాలను ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ షాక్ కు గురి చేస్తున్నాయి..ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చింది. దీంతో అందరూ ఒక్కసారి నోర్లు వెళ్ళ బెట్టారు..కూల్‌డ్రింక్‌ తాగుదాం అనుకున్న ఓ వ్యక్తికి ఓ ఫుడ్‌ డెలివరీ కంపెనీ దిమ్మతిరిగే షాకిచ్చింది. అతడు ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం కూల్‌డ్రింక్‌ బాటిల్‌ పంపింది. కానీ అందులో యూరిన్‌ నింపి ఉంది. ఈ దారుణ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఒలీవర్‌ మెక్‌మానస్‌ లాక్‌డౌన్‌లో భోజనం ఆర్డర్‌ చేశాడు. అందులో కూల్‌డ్రింక్‌ కూడా ఉంది.. అలా ఆర్డర్ తీసుకున్నాడు.



బాటిల్‌లో ఉన్నది ఏదో తేడాగా కనిపించింది. తీరా అది మనిషి యూరిన్‌ అని అర్థం కావడంతో అతడికి కడుపులో దేవినట్లైంది. ఆకలితో ఉన్న నాకు ఇలా యూరిన్‌ బాటిల్‌ పంపుతారా అని ఆవేశంతో ఊగిపోయాడు.. ఆ బాటిల్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.పంపిన హెల్లో ఫ్రెష్‌ యూకే కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.అడ్రస్‌ చెప్తే దీన్ని మీకు పంపిస్తానని  సోషల్ మీడియాలో  రాసుకొచ్చాడు. ఇంకేముందీ అతడి ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారగా ఏం జరిగిందో వివరించి చెప్పండి అంటూ జనాలు అతడి వెంటపడ్డారు.


 దీంతో ఇదెక్కడి గోలరా నాయనా అనుకున్న మెక్‌ తెల్లవారేసరికి ఆ  పోస్ట్  ‌ డిలీట్‌ చేశాడు. అయితే అప్పటికే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి రచ్చ చేస్తుంది.హలో ఫ్రెష్‌ కంపెనీ సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పింది. జరిగిన తప్పిదానికి మీకు ఎలా క్షమాపణలు చెప్పాలో అర్థం కావడం లేదని చింతిస్తూ  పోస్ట్   చేసింది..నిజానికి ఆ కంపెనీకి బాటిల్ కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది.డెలివరీ బాయ్‌ మూత్ర విసర్జన చేసే సమయం లేకపోవడంతో బాటిల్‌లోనే కానిచ్చేసి ఉంటాడని, ఆ సంగతి మర్చిపోయి ఆ బాటిల్‌ను నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మెక్‌ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు..ఇలా ఇది వైరల్ అయ్యింది..అందుకే ఏదైనా ఆర్డర్ చేసే టప్పుడు ఆలోచించి చేస్తే బెస్ట్..

మరింత సమాచారం తెలుసుకోండి: