రాహుల్‌గాంధీ స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. గ‌తంలో చాలామంది గాంధీ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో కొన‌సాగారు. కానీ రాహుల్‌గాంధీలా మాత్రం సిప్లిసిటీగా ఉండ‌లేదు. కొన్నాళ్లుగా రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌ల్లోనే సాధార‌ణ జ‌నంతో క‌ల‌సిపోయి.. నేరుగా వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే.. వారితో ఆడి పాడుతున్నారు. వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. గాంభీర్యాన్ని వ‌దిలి పెదాల‌పై చిరున‌వ్వును చిందిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయ‌కుడి నుంచి ఈ స‌డెన్ ఛేంజ్‌..ఆయ‌న‌కు మంచి అభిప్రాయం క‌లిగేలా చేస్తోందంటూ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి రాజ‌కీయాల‌తో దీన్ని ముడిపెట్ట‌డం అవివేక‌మ‌వుతుంది. రాహుల్ ఖ‌చ్చితంగా ఇప్పుడు జ‌నం మెచ్చే నాయ‌కుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం జ‌నంలో మాత్రం బ‌లంగా వెళ్తోంది.


కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తున్న రాహుల్‌గాంధీ బుధ‌వారం ఉద‌యం కొల్లంలో మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌లను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. మత్స్యకారుల ఇబ్బందుల్ని స్వయంగా పరిశీలించేందుకు తెల్లవారుజామున కేరళ సమీపంలో సముద్రం నీళ్లలో దూకారు. హఠాత్తుగా ఆయన ఇలా చేయడంతో పడవలో ఉన్నవారు భ‌య‌ప‌డ్డారు. అయితే కొద్ది క్ష‌ణాల్లోనే ఆయ‌న నీటిపై ఈదుతూ క‌నిపించ‌డంతో  ఊపిరి పీల్చుకున్నారు. తీరానికి చేరుకున్నాక ఆయన తడి దుస్తులు మార్చుకున్నారు. చేపల కూరను ఆరగించడమే తప్పిస్తే ఆ చేపలు మన పళ్లెంలోకి ఎలా వస్తాయో, దాని వెనుక ఎంత శ్రమ ఉందో చాలామంది అర్థం చేసుకోరని రాహుల్‌ చెప్పారు.పది నిమిషాల పాటు నీళ్లలోనే ఉన్నారు. మత్స్యకారులకు ఏం కావాలో తెలుసుకుని ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని చెప్పారు.


కొద్దిరోజుల క్రితం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించిన రాహుల్‌గాంధీ ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహాకుల‌తో క‌లిసి స్వ‌యంగా వంట చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.   మష్ రూమ బిర్యానీ తయారీ విధానాన్ని చూసి, వారితో కలిసి వంట చేశారు. తర్వాత వారితో కలిసి ఆ బిర్యానీ రుచి చూశారు. బిర్యానీ భేష్ అంటూ తమిళంలో ప్రశంసించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోస్టు చేసిన గంటల వ్యవధిలో 5లక్షల మంది వీక్షించారు. పెరియతంబి రుచికరమైన వంటకాలు తయారుచేయడంతో ఆగిపోరు. ఆ వంటలను నిరుపేదలకు, అనాథలకు రుచి చూపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: