నకిలీ ఐడీలు క్రియేట్ చేసుకుని సమాజంలో మోసం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. సైబర్ పోలీసులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న వీరిని అదుపులోకి తీసుకోవడం కష్టతరమవుతోంది. ప్రేమిస్తున్నానని పరిచయమై.. ఇంట్లో అవసరం ఉంది.. డబ్బులు కావాలంటూ లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేసుకుంటున్నారు. తీరా వాళ్లు చేసింది మోసమని తెలిసాక బాధితులు లబోదిబోమని తలలు బాదుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తునే ఉంటాం. సోషల్ మీడియాలో డబ్బున్న వాళ్లని టార్గెట్ చేసి ఇలాంటి మోసం చేస్తుండటం చూస్తూనే ఉంటాం.

ప్రేమ పేరుతో ఓ వ్యాపారిని నిండా ముంచింది. బాగా డబ్బున్న ఓ వ్యాపారికి ఐపీఎస్ అధికారిణిని అని పరిచయమైంది ఓ యువతి. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని యువతే వచ్చి అడిగితే ఎవరు కాదంటారు. ఒక్కసారిగా ఆ వ్యాపారికి ఐపీఎస్ అధికారిణి పెళ్లి చేసుకోబోతున్నానని సంతోషంలో మునిగిపోయాడు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ యువతి తన విశ్వరూపం చూపించింది. అవసరాలు ఉన్నాయంటూ పలు దఫాలుగా రూ.11 కోట్ల వరకు డబ్బులు తీసుకుంది. డబ్బులు చేతిలోకి వచ్చాక ఐపీఎస్ అధికారిణి ఆ వ్యాపారితో పెళ్లికి రెడీ కాలేదు. దీంతో తాను మోసపోయానని ఆ వ్యాపారి గ్రహించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వీరారెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో వ్యాపారి. అతడికి కోట్లల్లో ఆస్తి ఉంది. అయితే ఇటీవలే వీరారెడ్డికి శ్రుతి సిన్హా అనే ఐపీఎస్ అధికారిణి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసి.. అమ్మాయే పెళ్లి చేసుకుందామని చెప్పింది. దీంతో వీరారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని పలుమార్లు డబ్బులు తీసుకునేది. వీరారెడ్డి కూడా కాదనకుండా డబ్బులు ఇచ్చేవాడు. అలా రూ.11 కోట్ల వరకు డబ్బులు అందజేశాడు.

అయితే ఇటీవలే వీరారెడ్డికి అసలు విషయం తెలిసింది. ఆమె అసలు ఐపీఎస్ అధికారిణి కాదని.. డబ్బు కోసం మోసం చేస్తోందని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆమె దగ్గరి నుంచి రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తులు, ఖరీదైన కార్లు, విల్లా, డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు ఉందని.. తదుపరి విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: