మార్చి నెలలో జరగబోయే నగర స్థానిక ఎన్నికల వేడి మెల్ల మెల్లగా రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా రాజకీయం పొంగి పొరలుతోంది. ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ప్రజల ఊహాగానాల ప్రకారం నగర స్థానిక ఎన్నికలు కూడా వైసీపీ పరమే అనుకుంటున్నారు. కానీ టీడీపీని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో నగర పరిధిలో జరిగిన అభివృద్ధిని చూస్తే సామాన్యులు వైసీపీకి ఓటేస్తారా అన్న సందేహాలు  కలుగుతున్నాయి. పల్లె పోరులో వచ్చిన తీర్పే ఇక్కడ కూడా వస్తుందనుకోవడానికి వీలు లేదు.

జగన్ ప్రవేశపెట్టిన పధకాలు పల్లె ప్రజల్లో మంచి పేరును తీసుకు వచ్చాయి. కాబట్టి గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా తారు మారు అయ్యే ఆకాశాలు లేకపోలేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ ఇవన్నీ బేరీజు వేసుకుని ఎటువంటి కార్యాచరణతో ఎన్నికలకు వెళ్తారన్నది తెలియాల్సి ఉంది. కాగా ఒకవైపు టీడీపీ నేతలు పల్లె పోరులో వైసీపీ అరాచకాలు చేసి, దౌర్జన్యాలు సృష్టించి తమ అభ్యర్థులను గెలిపించుకున్నారని వాదిస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం నిస్పక్షపాతంగానే ఎన్నికలు మరియు కౌంటింగ్ జరిగాయని చెప్పడం తెలిసిందే.

ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళిక మరియు క్యాండిడేట్ ల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. మరి ఈ ఎన్నికలు వైసీపీ మరియు టీడీపీ లకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయి. చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు జగన్ నిలువగలడా...? చంద్రబాబు సంధించే రాజకీయ అస్త్రాలకు జగన్ ఎదురొడ్డగలడా...? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: