స్థానిక ఎన్నికలను స్థానికంగానే  వదిలిపెట్టి పెద్దగా పట్టించుకోని భారతీయ జనతా పార్టీ... మున్సిపల్ ఎన్నికలకు మరియు కార్పొరేషన్ ఎన్నికలను మాత్రం సీరియస్గా తీసుకుంటోంది . ఈ ఎన్నికలకు పకడ్బందీగా ప్రణాళిక చేస్తూ వెళుతోంది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సోము వీర్రాజు  సమన్వయ కర్తలను నియమించారు. అన్ని రెవెన్యూ డివిజన్ పరిధులలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 13 జిల్లాలకు ఇంచార్జ్ లను ఇప్పటికే నియమించారు. వీరు పర్యవేక్షణ చేపట్టే విధంగా ప్రణాళికలు రచించారు. ఉత్తరాంధ్ర కు సంబంధించి నరసింహా రావు, కే హరిబాబు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, కాశీ విశ్వనాధ్ రాజులకు  బాధ్యతలను అప్పగించారు.

ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలకు.. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు, చిన్నం రామకోటయ్య అంబికా కృష్ణ లను నియమించారు. ఇకపోతే గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతను కర్ణ లక్ష్మీనారాయణ, కిషోర్ బాబులకు అప్పగించారు. అదే విధంగా నెల్లూరు, కడప మరియు చిత్తూరు జిల్లాల బాధ్యత కోసం సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి లను నియమించారు. అనంతపురం జిల్లా బాధ్యత కొరకు  టి జి వెంకటేష్, పార్థ సారధి, వరదా పురం సూరి లను నియమించారు. అయితే ఇదంతా గమనిస్తే సీనియర్లను మరియు అటు టిడిపి నుంచి వచ్చిన నేతలను, అలాగే ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళని ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ తమ సత్తా చాటే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే పల్లె పోరులో ఆధిక్యాన్ని ప్రదర్శించిన వైసీపీ జోరు మీద ఉండగా, టీడీపీ సైతం మంచి ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళుతోంది. బీజేపీ మాత్రం ఎప్పుడూ హిందూ వాదాన్ని పట్టుకుని వేలాడుతోంది. అయితే తెలంగాణలో వర్క్ అవుట్ అయిన విధంగా, ఇక్కడ కాదనేది వారు తెలుసుకుని ప్రజలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: