ఈ మధ్యకాలంలో మొబైల్ వాడకం ఎంతలా  పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా చేతిలో మొబైల్ ఉండాల్సిందే చేతిలో ఒక చిన్న మొబైల్ కనిపించకపోయినా సర్వం కోల్పోయిన విధంగా ఫీలవుతున్నారు. ఒకప్పుడు కేవలం అవసరాలకు మాత్రమే మొబైల్స్ వాడేవారు కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా మొబైల్ వాడుతున్నారు. వెరసి రోజురోజుకు మొబైల్ వాడకం పెరిగిపోతూనే ఉంది. అయితే రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుండటం అతి తక్కువ ధరలకే అటు వివిధ రకాల ఆఫర్లను టెలికాం రంగ సంస్థలు ప్రకటిస్తూ ఉండటంతో మొబైల్ వాడకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి పడుకునే  వరకు కూడా ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతూనే ఉన్నారు. ఇక కొంతమంది అయితే రాత్రి పడుకోకుండా మొబైల్ వాడుతున్న వారు కూడా లేకపోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది కనీసం నిద్రపోకుండా రాత్రి మొత్తం మొబైల్ వాడుతూ ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. పగలు మొబైల్ వాడకం కంటే రాత్రి పూట ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మీద పడిపోయే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.



 అయితే రాత్రిపూట ఎక్కువగా మొబైల్ వాడితే ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు రాత్రిపూట మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో రకాల మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా మెదడుపై దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందట. ఇక మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని.. ఇక డిప్రెషన్ కు గురి అవుతారట.. చురుకుగా లేకపోవడం లాంటి సమస్యలు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో మొబైల్ వాడుతున్న వారిలో కనిపిస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: