మన దేశంలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా ప్రైవేటు కంపెనీలకు కేంద్రం సహకరిస్తుంది. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత కార్పొరేట్ కంపెనీల విషయంలో చాలా వరకు కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. దీని కారణంగా ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చులకన అవుతున్నారనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే ఆలోచిస్తూ ధరలను పెంచుతూ పోతుంది. అంతే కాకుండా ప్రైవేటు రంగానికి అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా వ్యాఖ్యలు చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వరంగ సంస్థలు మనకు వారసత్వంగా వచ్చేవి కాబట్టి వాటిని కాపాడుకోలేమని స్పష్టంగా చెబుతున్నారు. దీనితో మన దేశంలో ఇప్పుడు మోడీ తీరుపై ఆగ్రహం పెరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ముందు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చిన తర్వాత ఎటువంటి కొత్త సంస్థలు ఏర్పాటు చేయకపోయినా ఉన్నవాటిని అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని కనీసం తెలుసుకోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇదే ప్రధాన అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే లేని వ్యక్తి దేశాన్ని ఎలా కాపాడుతారు అనే ప్రశ్నలు ఉన్నాయి. దేశంలో ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా లాభాలు ఆర్జించాలి అనే భావనతో మోడీ ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: