ఖమ్మం జిల్లాలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్తారు ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. చాలా వరకు చర్చలు ఈ జిల్లాపై జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నేతలు టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలేదు. అయితే ఇప్పుడు కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం ఇప్పటి వరకు జరిగింది.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడటం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావించిన చాలా మంది తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి నాయకులు భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారట.

అయితే ఇప్పుడు కూడా కొన్ని ఆఫర్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఇస్తున్నారు. తమను మీరు  చూసుకుంటే మీతో కలిసి నడుస్తామని హామీలు కూడా ఇస్తున్నారట. తుమ్మల నాగేశ్వరరావుతో ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. భారతీయ జనతా పార్టీ లోకి వెళితే మీ వెంట మేము వస్తాము అని చెబుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని సూచనలు కూడా చేసినట్లుగా సమాచారం. అందరం కలిసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్దామని తెరాసను ఎదుర్కొందామని పదే పదే చెప్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: