రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడి వేడిగా జరుగుతుంది.. నిన్నటి వరకు పంచాయితీ ఎన్నికలు రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. మార్చి రెండు నుంచి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. గతంలో వేసిన నామినేషన్లు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. పార్టీ గుర్తుల తో జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయాన్ని ఎలాగైనా అందుకోవాలని రాజకీయ నేతలు శ్రమిస్తున్నారు. ఇంకా 20 రోజులు వుండగానే ప్రచారం తో రాష్ట్రమంతా హోరెత్తిస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.. ఎమ్మెల్సీ అభ్య ర్థుల జాబితాను కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటిస్తుంది. కడప ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు సి.రామచంద్రయ్య పేరు ఖరారైంది. ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆయన 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో కడప నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1986 నుంచి 1988 వరకు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అదే కాలంలో రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థల ఛైర్మన్‌గా సేవలందించారు. అనంతరం ఆయన దాదాపు 11 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.



ఇక టీడీపీ పార్టీ లో ఎప్పుడు ఏదోక సమస్య రావడం లేదా వివిధ కారణాల వల్ల ఆ పార్టీలో ఉండటం ఇష్టం లేక బయటకు వచ్చాడు. ఆ తర్వాత సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో చేరారు.తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు.కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2011లో రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి కొనసాగారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీని వీడి వైకాపాలో చేరారు. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైసీపీ పార్టీ తరపున ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: