తిరుపతిలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ పార్టీకి తీవ్ర నిరాశ మిగిలింది. అతి తక్కువ స్థానాల్లో విజయాన్ని అందుకుంది. అధికార పార్టీ మాత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని జెండాను పాతారు. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో స్వయంగా అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే లు రంగం లోకి దిగి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ గుర్తులను ఉపయోగించి జరిగే ఈ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.  ఇలా చూసుకుంటే ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నారు. మార్చి 2 నుంచి రాజకీయ చర్చలు షురూ కానున్నాయి.


ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రభుత్వ ఖరారు చేస్తుంది. ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాలో ప్రకటించగా ఇప్పుడు తిరుపతి లో ఆయా స్థానాలకు పోటీ చేసి మరణించిన వారి స్థానాలను భర్తీ చేసే ఆలోచనలో పడ్డారు. తిరుపతి లోక్‌సభ సభ్యులు దివంగత బల్లి దుర్గాప్రసాద్‌ తనయుడు బల్లి కల్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి వరించనుంది. ఈ మేరకు అభ్యర్థిత్వాన్ని వైకాపా గురువారం ప్రకటించింది. సెప్టెంబరు 16న అనారోగ్యంతో తిరుపతి ఎంపీ కన్నుమూశారు. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో నవంబరు 19న ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో అభ్యర్థిత్వం విషయమై సమావేశం జరిగింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనసభ్యులు పాల్గొన్నారు.



సాధారణంగా పదవిలో ఉంటూ మరణిస్తే వారసులకు అవకాశం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిత్వం విషయమై చర్చ నడిచింది.కల్యాణ్‌ చక్రవర్తి రాజకీయాలకు కొత్త కావడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎంపీ స్థానానికి ఇతరులను ఎంపిక చేయాలని తలచారు. ఇంకా తిరుపతి ఉప ఎన్నిక జరగనప్పటికీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీల ఎన్నిక ముందుగా వచ్చింది. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు స్థానాల్లో ఓ స్థానం నుంచి కల్యాణ్‌ చక్రవర్తికి అవకాశం కల్పించారు. వెంకటగిరిలో నివాసం ఉంటున్న అభ్యర్థి ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. తండ్రి దుర్గాప్రసాద్‌ ఆశయాలను నెరవేర్చడానికి తనవంతు కృషి చేస్తానని అభ్యర్థి మీడియా ద్వారా వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: