కృష్ణాజిల్లాలో ఇప్పుడు విజయవాడ హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంత వరకు విజయం సాధిస్తుంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కేసినేని నాని కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు వెళ్ళే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం కూడా ఉంది.

చాలా మంది నేతలు పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా లేరు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు తీరుతో ఇప్పుడు అదే జరుగుతుందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా లో మంచి ప్రభావం చూపించింది. ఈ తరుణంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం పార్టీని చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారు. అయితే తన కుమార్తె విషయంలో నానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు.

కానీ ఆయనకు సహకారం అందించే విషయంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలు కూడా విఫలమవుతున్నారని చెప్పాలి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా  ఇబ్బందులు పడుతున్నారు. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు. విజయవాడలో కార్యకర్తలు ఎక్కువగానే ఉన్నారు. కార్యకర్తలకు కొందరు అండగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ వాడుకోలేకపోతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. మరి ఈ విభేదాలను చంద్రబాబు నాయుడు ఎంతవరకు పరిష్కరిస్తారో చూడాలి. అన్నీ తెలిసినా కూడా నారా లోకేష్  ఈ విషయంలో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: