ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలి అంటే చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలి. ఇక భారతీయ జనతా పార్టీని కలుపుకుని వెళ్లే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా లేకపోతే మాత్రం పరిస్థితులు చాలా వేగంగా మారే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల పట్ల నేతల్లో ఆగ్రహం పెరిగిపోతుంది.

అయితే చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొంతమంది నేతలు విషయంలో దూకుడుగా వెళుతున్నారు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కొంతమంది నేతలు సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేయడం లేదని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలున్నాయని ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం అమరావతిలో లేకపోతే విజయవాడలో ఉన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసే నేతలను ఆయన పక్కన పెట్టడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. అగ్రనేతలు చాలామంది ఇప్పుడు ప్రజల్లోకి రాకుండా స్థానిక నాయకులతో కూడా మాట్లాడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు త్వరలోనే వారిని పదవుల నుంచి తప్పించి కొంతమంది యువ నేతలకు పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లోకేష్ తో సన్నిహితంగా ఉండే నేతలను ఎంపిక చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: