అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల జోరు వాడీవేడిగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని మునిసిపాలిటీలలో ఎన్నికల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ముఖ్యంగా రాయ దుర్గం విషయానికి వస్తే ఎన్నికల ప్రచారాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇక్కడ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు టిడిపి తరఫున ప్రచారం లో పాల్గొంటే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న ప్రచార జోరు చూస్తుంటే ఇదేదో సార్వత్రిక ఎన్నికలా అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి.  


మున్సిపల్ ఓటర్లను ఆకర్షించుకోవడం మానేసి ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఈ ఇద్దరు నేతలు. పార్టీల మధ్య కాకుండా ఈ ఇద్దరు నేతల మధ్య వార్ అన్నట్టు గా ఒక రేంజ్ లో సాగుతోంది. రాయదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి.మున్సిపాలిటీ ఏర్పడ రోజు నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఇండిపెండెంట్లు , ఒక సారి కాంగ్రెస్ , ఐదు సార్లు టిడిపి  చెందిన వాళ్లు ఛైర్మన్ అయ్యారు. దీంతో ఈ సారి ఎలాగ్తెనా మున్సిపాలిటీని క్తెవసం చేసుకోవడానికి  అధికార వ్తెసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి నాయకుల మాటలు చూస్తుంటే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గుర్తుకొస్తున్నారని.. భవిష్యత్తులో టిడిపి పార్టీ స్థాయి ప్రజాశాంతి పార్టీ స్థాయి కన్నా అధ్వానంగా మారబోతుందని ప్రభుత్వ విప్ కాపు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.


కాలువ శ్రీనివాసులు అంత అబద్దాల కోరు ఇంకొకరు లేరని.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. అయితే కాలువ మాత్రం  వైసిపి కౌన్సిల్ అభ్యర్థులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామంటూ వాలంటీర్లు ప్రజలకు బెదిరిస్తున్నారని ప్రభుత్వం అలా దారుణంగా వ్యవహరిస్తోంది అంటూ విమర్శిస్తున్నారు.  రాయదుర్గంలో మున్సిపల్ వేడి కంటే ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే ఎక్కువగా హైలైట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: